జగన్‌కు వెయ్యి కార్లతో స్వాగతం పలకనున్న శ్రీకాకుళం నేతలు

  • నేడు శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశం
  • ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని పిలుపు
  • వచ్చే నెల 3న రాజాంలో ముగింపు
విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రానికి జగన్ పాదయాత్ర ముగియనుంది. అనంతరం వీరఘట్టం మండలంలోని కెళ్ల గ్రామానికి జగన్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో నేడు ప్రారంభం కానున్న యాత్ర వచ్చే నెల 3న రాజాంలోని బహిరంగ సభతో ముగియనుందని తెలిపారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Vizianagaram
Srikakulam District

More Telugu News